మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్నది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది.. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాణంగా నటిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని తందానే.. తందానే సాంగ్ ను ఈ నెల 3వ తేదిన రిలీజ్ చేయనున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa