పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నీమధ్య పర్సనల్ పనిపై ఔటాఫ్ స్టేషన్ వెళ్లి రీసెంట్గానే హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చీ రాగానే హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించి, దసరా నవరాత్రులను ఆరంభించారు.
అలానే ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. HHVM డైరెక్టర్ క్రిష్, మరియు నిర్మాత AM రత్నం లకు ఇచ్చిన మాట మేరకు అక్టోబర్ 17వ తేదీ నుండి పవన్ హరిహర వీరమల్లు అవతారం లోకి షిఫ్ట్ అవబోతున్నారని టాక్.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.