కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కెరీర్లో చేస్తున్న 169వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు "జైలర్" అనే పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక, రజినీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల విషయానికి వస్తే, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ప్రఖ్యాత కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో రజినీకాంత్ రెండు భారీ సినిమాల డీలింగ్ ను కుదుర్చుకున్నారని టాక్. రజిని గత చిత్రం రోబో 2.O సినిమాను భారీస్థాయిలో లైకానే నిర్మించింది. ఆపై రజినీ సినిమాలను ఎన్నింటినో డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సంస్థ తాజాగా రెండు సినిమాల డైరెక్ట్ డీలింగ్ ను కుదుర్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.