శాసనమండలిలో షార్ట్ డిస్కషన్ మొదలుపెట్టిన తర్వాత చర్చించకుండా మంత్రి స్టేట్మెంట్ ఇస్తామని ముందుకొచ్చిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తెలిపారు. అయన మాట్లాడుతూ... శాసనసభలో చర్చించడానికి లేని భయం శాసనమండలిలో మాట్లాడటానికి దేనికి? కౌన్సిల్ చైర్మన్ నుంచి శాసనసభ వ్యవహారాల మంత్రి సభను హైజాక్ చేయడం ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఎవరికి మైకు ఇవ్వాలి, టీవీల్లో ఎవరిని చూపించాలి అనేది కూడా మంత్రి పయ్యావుల కన్నుసన్నల్లో జరగడం చైర్మన్‌ని అవమానించడమే. కోర్టులన్నా, శాసనమండలి అన్నా గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థల పతనం జరుగుతోంది. హెరిటేజ్ కోసం చంద్రబాబు కుటుంబం చేసిన అవినీతి ఇందాపూర్ డెయిరీకే పరిమితం కాలేదు. సంగం, వైష్ణవి, ప్రీమియర్ డెయిరీ, ఏఆర్ డెయిరీ, భోలేబాబా పేరుతో పెద్ద సిండికేట్ బయటకొచ్చింది. అన్నింటికీ అసలు సిసలు బాబా చంద్రబాబే. ఆయన చేసిన అవినీతి బయటకు రావడంతోనే చర్చకు భయపడిపారిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa