రాష్ట్ర ప్రజలు కూటమి పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బలంగా పనిచేయాలి. ప్రజల సమస్యలను, వారి ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబించేలా అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలకు సూచించారు. జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం బుధవారం అసెంబ్లీలోని జనసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.... జనసేన పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్రతిహాసంగా ముందుకు సాగడమే దీనికి నిదర్శనమని అన్నారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు చట్టసభలకు హాజరు అవుతూనే మిగిలిన సమయాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం వెచ్చించాలని చెప్పారు. ఉద్యమి సభ్యత్వ నమోదుకు క్షేత్రస్థాయిలో మంచి స్పందన వస్తోందని, దీనిని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నత ఆశయంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామి మీరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa