ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్ క్రికెట్ టీం

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 03:52 PM

టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్‌తో తలపడనుంది. క్రికెట్‌లోని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.గత రెండు టోర్నీల చరిత్రను పరిశీలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2022, 2024 ప్రపంచకప్‌లలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్‌లో గెలిచిన జట్టే చివరికి ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ పునరావృతం అవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa