యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది RRR సినిమాతో ప్రేక్షకులను పలకరించి, బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ తదుపరి తారక్ మీడియా కంటికి కనిపించడమే మానేశాడు.
దీంతో అందరు కూడా కొరటాల మూవీ కోసం సన్నద్ధమవుతున్నాడని అనుకున్నారు. కానీ, బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కొచ్చిన తారక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. RRR కోసం కాస్త బొద్దుగా మారిన తారక్ లో ఎలాంటి మార్పు లేకపోవడం చూసి, కొరటాల మూవీ కి ఇంకా సమయం పట్టేలా ఉందని ఫ్యాన్స్ ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు.
తాజాగా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం, వచ్చే నెల నుండే షూటింగ్ స్టార్ట్ చేసి, వస్తున్న పుకార్లకు అడ్డుకట్ట వెయ్యాలని మేకర్స్ సన్నాహాలు మొదలెట్టారట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట.