పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ "సలార్" ఒకటి. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఇందులో స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్టు టాక్.
తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ స్టార్ మా ఛానెల్ చేజిక్కించుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఫ్యూచర్ లో వస్తుందేమో చూడాలి మరి.
కన్నడ మూవీ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.