యువనటుడు విశ్వక్ సేన్ తో కలిసి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం "ఓరి దేవుడా". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి నిన్ననే ట్రైలర్ విడుదలైంది.
హిలేరియస్ ఫన్ కంటెంట్ తో, ఇన్నర్ మెసేజ్ తో, అమేజింగ్ ట్రైలర్ కట్ తో వచ్చిన ఈ ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. యూట్యూబులో 4.3 మిలియన్ వ్యూస్ తో, టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఈ ట్రైలర్ దూసుకుపోతుంది. దీన్ని బట్టే అర్ధమవుతుంది ఈ ట్రైలర్ ను ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో.. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసిందని చెప్పాలి.
కోలీవుడ్ డైరెక్టర్ అష్వత్ మరిముత్తు డైరెక్షన్లో "ఓహ్ మై కడవులే" అనే తమిళ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.