నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటిటి డిబట్ ఎంట్రీ ఇస్తూ చేసిన మొట్టమొదటి హోస్టింగ్ ఈవెంట్ "అన్ స్టాపబుల్ విత్ NBK". గతేడాది నవంబర్ లో ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ ఐన ఈ షోకు ఆడియన్స్ నుండి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ ఈ షోకు సెకండ్ సీజన్ ను తీసుకురాబోతున్నారు.
సెకండ్ సీజన్ కి సంబంధించిన టీజర్ ను ఇటీవలే విజయవాడలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. రేపే అన్ స్టాపబుల్ విత్ NBK S 2 యొక్క ట్రైలర్ విడుదల కాబోతుందని అఫీషియల్ గా ప్రకటించారు.
ఈ షో ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో చెప్పకుండా ఆడియన్స్ ను యమా సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్. దీంతో ఆడియన్స్ అందరూ ఈ ట్రైలర్ పట్ల ఎంతో కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు.