మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం "గాడ్ ఫాదర్". దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.
దసరా పండుగ రోజున మరో రెండు సినిమాలు విడుదలైన కారణంగా, లిమిటెడ్ థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లను నమోదు చేస్తుంది. హిందీలో కూడా ఇదే పరిస్థితి. దీంతో గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు ఈ రోజు నుండి మరో 600 థియేటర్లను పెంచుతున్నట్టు తెలుపుతూ, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసారు. మరొక వీడియోలో సల్లూభాయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలానే గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు చూపిస్తున్న విశేష ఆదరణకు నార్త్ ఆడియన్స్ కు చిరు థాంక్స్ చెప్పారు.
మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, అనసూయ, షఫీ కీలకపాత్రలు పోషించారు.