AP: ఫిబ్రవరిలో 'స్త్రీ శక్తి' పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు 26 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు, దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ 92% దాటింది. అయితే, ఈ పథకం వల్ల పురుషులు బస్సుల్లో ప్రయాణించడానికి వెనుకాడుతున్నారు. వారి సంఖ్య 37 శాతానికి పడిపోయింది. డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని పురుషులు వాపోతున్నారు. సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa