ఇన్నాళ్లూ లడ్డూ పేరుతో ఆరోపణలు చేసిన కూటమి నాయకులు దానిపై మండలిలో చర్చకు రమ్మంటే భయపడి పారిపోతున్నారు అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. వైయస్ఆర్సీపీఆరుసార్లు వాయిదా తీర్మానం కోరితే, నిర్దద్వంగా తిరస్కరించారు. నిజానికి ఈ అంశంపై చర్చకు బీఏసీ సమావేశంలో ఒప్పుకుని, సభలో మాట తప్పారు. గత నెల 26న జరిగిన బీఏసీలో ఈ అంశంపై సభలో చర్చకు అంగీకరిస్తూ సెక్రటరీ జనరల్ పేరుతో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ మా సభ్యులు మాట్లాడటం మొదలు పెట్టగానే ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇస్తానంటూ మంత్రి పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు. శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లఘు చర్చలో ముందుగా ప్రతిపక్షం మాట్లాడాలని మండలి ఛైర్మన్ సూచించినా మంత్రి పట్టించుకోకుండా ఆయన్ను అగౌరవపరిచారు. అలా సభలో చర్చ జరగకుండా అడ్డుపడ్డారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చింది అబద్ధమైతే శాసనమండలిలో చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారు? ఇందాపూర్–హెరిటేజ్ మధ్య సంబంధం లేకపోతే ఆ పేరెత్తడానికి ప్రభుత్వం ఎందుకు వణికిపోతోంది? ప్రభుత్వానికి దమ్ముంటే ఈ రోజైనా సభలో చర్చకు ముందుకు రావాలి. అసలు మండలిలో మాట్లాడటానికి ఎందుకు భయం? ఎన్నాళ్లు ఇలా భయపడిపారిపోతారు? తప్పు చేయనప్పుడు భయం దేనికి?. అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వేసిన నిందలపై ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ కోసం చేసిన అక్రమాలు, మోసాలు బయటపడతాయనే భయంతోనే కూటమి ప్రభుత్వం చర్చకు భయపడి పారిపోతోంది. అయినా ప్రభుత్వాన్ని వైయస్ఆర్సీపీ వదిలే ప్రసక్తి లేదు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa