ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి నేతలు పోలీస్‌ వ్యవస్థను రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 02:40 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, ’రెడ్‌ బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాలికి వదిలేశారని, ’పొలిటికల్‌ గవర్నెన్స్‌’ పేరుతో వైయ‌స్ఆర్‌సీపీనేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆక్షేపించారు. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, కోర్టు ధిక్కార హెచ్చరికలు జారీ చేసినా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్‌ గవర్నెన్స్‌ పేరిట యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోంది. విపక్ష వైయ‌స్ఆర్‌సీపీపై కక్ష తీర్చుకోవడానికి, ఆ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికే పోలీసులను ఉపయోగించుకుంటూ.. శాంతి భద్రతలను పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. విపక్ష వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పుడున్నారు. ఈ క్రమంలో పౌరహక్కులను కూడా ఉల్లంఘిçస్తూ.. చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa