తిరువూరులో నిర్వహించే నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణం కార్యక్రమం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎంపీ కేసినేని చిన్ని చెడగొట్టారని విమర్శించారు. తిరువూరు నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన కేసినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో దేవినేని అవినాష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసినేని చిన్ని లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం మన దౌర్భాగ్యమని ఆయన అన్నారు. గతంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎంపీలుగా సేవలందించారని, అయితే ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, పంచాయితీలు, గూండాగిరి వంటి పనులు చేస్తున్న వ్యక్తి ఎంపీగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఎంపీకి ఉండాల్సిన హుందాతనం చిన్నికి లేదని, వేణుగోపాల స్వామి కళ్యాణం గొప్పతనాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. జిల్లా పరువు పోయేలా ఎంపీ వ్యవహరించారని, ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతనిపై రుబాబు చూపించడం తగదని అన్నారు. ఎమ్మెల్యేకు అధికారులను సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనఖ కళ్యాణ్‌లు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa