కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలలో వరుస అపచారాలతో స్వామి వారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరు లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... తిరుమల కొండపై మద్యం, రీల్స్, ఫోటో షూట్లు వంటి నిషిద్ధ కార్యకలాపాలు పెరిగిపోయాయని, భక్తుల రక్షణపై పాలకమండలికి నియంత్రణ కరువైందని కాకాణి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తికి నిష్కళంకమైన వ్యక్తిత్వం ఉండాలి. కానీ, ప్రస్తుతం బీఆర్ నాయుడు చుట్టూ తిరుగుతున్న అసభ్యకర వీడియోలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయిని ఆక్షేపించారు. ఏ ఐ ద్వారా ఆ వీడియోలు ఒరిజనల్ అని తేలినా, చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం" అని మండిపడ్డారు. ఆలయ పవిత్రతను కాపాడటానికి బీఆర్ నాయుడిని తక్షణమే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని లేదా ఆయనతో రాజీనామా చేయించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa