ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మా వంతు సాయం ఎల్లప్పుడూ చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 02:36 PM

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు స్వంత నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను బుధ‌వారం ఆయ‌న‌ ప్రారంభించి గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ శాసనసభ్యుడు మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెర‌డ్డి మాట్లాడుతూ..ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన కాలేజీ భవనాలు, స్థలాలను ప్రజలకు అందించామ‌న్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. సింగనపల్లి వాటర్ ప్లాంట్ ప్రారంభంతో గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa