AP: మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపుల వాటాను 30% నుంచి 60%కి పెంచేందుకు ఎక్సైజ్ శాఖ 'లిక్కర్ డిజిటల్ చెల్లింపులు' పాలసీని ప్రవేశపెట్టనుంది. ఈ పాలసీ ప్రకారం.. ప్రతి మద్యం దుకాణంలో డిజిటల్ చెల్లింపుల సౌకర్యం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. కొనుగోలుదారులు డిజిటల్ పద్ధతిలో చెల్లించడానికి లైసెన్సులు నిరాకరించకూడదు. అంతేకాకుండా రోజువారీ అమ్మకాలను పర్యవేక్షించడానికి 'ట్రాక్ అండ్ ట్రేస్' విధానాన్ని కూడా ఎక్సైజ్ శాఖ అమలు చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa