కన్నడ సినీ పరిశ్రమ నుండి రాబోతున్న మరొక పాన్ ఇండియా చిత్రం "బనారస్". ఈ సినిమాలో జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రచన - దర్శకత్వం జయతీర్థ చేసారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి ఔన్నత్యాన్ని, పవిత్రతను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో తగిన అంచనాలను ఏర్పరిచిన ఈ సినిమా తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు రాబోతుంది.
రేపు సాయంత్రం ఐదున్నరకు వైజాగ్ లోని CMR సెంట్రల్ మాల్ లో బనారస్ మూవీ టీం హల్చల్ చెయ్యనుంది. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో నవంబర్ నాల్గవ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa