పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా థియేట్సర్ లో రీ రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రెబల్'. ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దీక్షాసేత్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న ఈ సినిమాని గ్రాండ్ గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు శ్రీ బాలాజీ సినీ మీడియా అధికారికంగా ప్రకటించింది.