అనసూయ, డైలాగ్ కింగ్ సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆరి’. ఈ సినిమాకి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా పోస్టర్ ని హీరో అది సాయి కుమార్ రిలీజ్ చేసారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్రబృందం తెలిపింది.