పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'వర్షం'. ఈ సినిమాలో త్రిష హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లో షోలు వేయనున్నారు.