'కేరింత' ఫేమ్ విస్వంత్ దుద్దునపూడి, మాళవిక సతీషన్ కంభంపాటి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్". సంతోష్ కంభంపాటి డైరెక్షన్లో నేటితరం యువత ఫాస్ట్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చెయ్యడానికి ముహూర్తం ఖరారు చేసారు. రేపు ఉదయం 11:07 గంటలకు ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతుందని స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. అంతకుముందు ఆల్రెడీ ఒక ట్రైలర్ ను విడుదల చెయ్యగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మోడరన్ డేస్ లో లవ్ అనే కాన్సెప్ట్ ను విభిన్నంగా చూపిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, స్వస్తిక సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, వేణుమాధవ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa