ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి గతేడాది నంటించిన రెండు సినిమాలు లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ లు ఫిలింఫేర్ అవార్డుల్లో సత్తా చాటాయి.
లవ్ స్టోరీ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ లీడ్ హీరోయిన్ గా , మరియు శ్యామ్ సింగరాయ్ లో దేవదాసీగా క్రిటిక్స్ బెస్ట్ ఫిలిం అవార్డులను అందుకుంది.
ఒకే ఏడాది విడుదలైన రెండు సినిమాలు ఫిలింఫేర్ అందుకోవడం పట్ల ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తనకొచ్చిన రెండు ఫిలింఫేర్లను పక్కన పెట్టుకుని సాయి పల్లవి తీసుకున్న సెల్ఫీ పీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.