విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి, బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. విక్రమ్ తీసుకొచ్చిన ఊపుతో మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమాను మరోసారి సెట్స్ పైకి తీసుకుని వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా విడుదల కావడానికి రెడీ అవుతుందంట. ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. హీరో సిద్దార్థ్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa