టాలీవుడ్ హీరో మంచు విష్ణు సైతం ఆదిపురుష్ టీజర్ పై రియాక్ట్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న జిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది యానిమేషన్ సినిమా కావడంతో ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యారని, ముందే ఇది యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే టీజర్ పై ఇంతగా ట్రోల్స్ వచ్చేవి కాదన్నారు. ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్సే వస్తాయని, టీజర్ చూసి తాను కూడా మోసపోయినట్లు తెలిపాడు.