కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కి తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. దీంతో ఆయన తన తెలుగు మార్కెటింగ్ ను పెంచుకునేందుకు చేస్తున్న తొలి తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "ప్రిన్స్". కేవీ అనుదీప్ డైరెక్షన్లో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా పరిచయమవుతుంది.
అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న ఈ మూవీ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో , క్రేజీ సినీతారల సమక్షంలో అట్టహాసంగా జరగనుంది. ఇంతకూ ఈ ఈవెంట్ కు హాజరవబోయే చీఫ్ గెస్ట్స్ ఎవరంటే.... విలక్షణ నటుడు దగ్గుబాటి రానా, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ.