'ఏక్ మిని కథ' ఫేమ్ సంతోష్ శోభన్, 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం "లైక్ షేర్ సబ్స్క్రైబ్ (LSS)". ఇటీవలే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కగా, తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు.
'ఏమంటినబయా' అనే ఈ మాస్ ఫోక్ సాంగ్ రైల్వే స్టేషన్ లో అందరు కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడే పాట. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన ఈ పాటలో సంతోష్ శోభన్, సోనియా కశ్యప్ కలిసి స్టెప్స్ వేశారు. ఈ పాటను సింగర్ మాంగ్లీ ఆలపించగా, పెంచల్దాస్ సాహిత్యం అందించారు.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.