నాచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తిసురేష్ జంటగా రెండవ సారి నటిస్తున్న చిత్రం "దసరా". శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి కీర్తిసురేష్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో కీర్తి 'వెన్నెల' అనే పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఎల్లో కలర్ సారీ ధరించి, అచ్చు పెళ్ళికూతురిలా ముస్తాబై, సంతోషంతో చిందేస్తున్న కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.