ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'పుష్ప 2'. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.