ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీమేక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది. భీమ్లానాయక్, గాడ్ ఫాదర్, ఓరి దేవుడా సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. దీంతో ఒకేసారి 7 సక్సెసఫుల్ మూవీస్ రీమేక్ రైట్స్ ను కొని అట్టిపెట్టుకున్నారట మా ప్రెసిండెంట్, హీరో మంచు విష్ణు. తగిన సమయాన్ని బట్టి ఈ రీమేక్ లను అధికారికంగా ప్రకటిస్తానని విష్ణు చెప్పారు.
ప్రస్తుతం విష్ణు జిన్నా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్షన్లో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకు రాబోతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న విష్ణుకి ఈ సినిమా ఘనవిజయం తీసుకురావాలని కోరుకుందాం.