నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఈ నెల 21న విడుదల చేయనున్నారు.ఈ కార్యక్రమం కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర జరగనుంది. కొండారెడ్డి బురుజు దగ్గర సినిమా టైటిల్ లాంచ్ చేయడం టాలీవుడ్ లో ఇదే తొలిసారి అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.