టాలీవుడ్ యువనటుడు సందీప్ కిషన్ "మైఖేల్" సినిమాతో పాన్ ఇండియా బరిలోకి అడుగిడుతున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క టీజర్ రేపు రిలీజ్ కాబోతుంది.
ఒక్కో భాషలో ఒక్కొక్క సెలెబ్రిటీ మైఖేల్ టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. మైఖేల్ మలయాళ టీజర్ ను దుల్కర్ సల్మాన్, కన్నడ టీజర్ ను రక్షిత్ శెట్టి, హిందీ టీజర్ ను జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్లు రాజ్ అండ్ DK రేపు సాయంత్రం విడుదల చెయ్యనున్నారు. రేపు సాయంత్రం 05:31 నిమిషాలకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేతులమీదుగా మైఖేల్ టీజర్ విడుదల కాబోతుంది.
ధనుష్ అప్ కమింగ్ మూవీ 'కెప్టెన్ మిల్లర్' లో సందీప్ కిషన్ కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ అనుబంధంతో ధనుష్ సందీప్ కిషన్ నటిస్తున్న మైఖేల్ టీజర్ రిలీజ్ చేసేందుకు రాబోతున్నారన్న మాట.