యువనటుడు సందీప్ కిషన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "మైఖేల్" ఎప్పటి నుండో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
రీసెంట్గా మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 20వ తేదీ అంటే రేపు సాయంత్రం నాలుగింటి నుండి హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ 3లో మైఖేల్ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో 05:31 నిమిషాలకు కోలీవుడ్ హీరో ధనుష్ చేతుల మీదుగా మైఖేల్ టీజర్ రిలీజ్ కాబోతుంది.
కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైరెక్టర్ కం యాక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా, 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.