కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ.. ఇద్దరూ సొంత అన్నదమ్ములన్న విషయం అందరికి తెలిసిందే కదా. సూర్య ఎంత తన సొంత సోదరుడైనా, చిత్రపరిశ్రమలో అతని బ్రదర్ కేరాఫ్ అడ్రెస్ తో కాకుండా తనకంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ను కేరాఫ్ అడ్రెస్ మార్చుకుని స్టార్ హీరో స్థాయికి కార్తీ ఎదిగాడంటే నిజంగా చాలా గ్రేట్. ఇదే విషయాన్ని సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున చెప్పారు.
తమ అన్నల పేరుతో కాకుండా తమకంటూ ఇండస్ట్రీలో సొంత ఇమేజ్ ను, క్రేజ్ ను సంపాదించుకోవడమంటే నిజంగా మాములు విషయం కాదు... ఇలాంటి లక్షణం నేను ముగ్గురిలో మాత్రమే చూసాను... టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్, శాండల్ వుడ్ లో శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, కోలీవుడ్ కొచ్చేసరికి సూర్య తమ్ముడు మన "సర్దార్" - అని నాగార్జున చెప్పడం జరిగింది.
నాగార్జున చెప్పిన మాటలు అక్షర సత్యాలని, ఈ ఒక్క లక్షణమే కాదు... ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే అద్భుతమైన గుణం కూడా ఈ ముగ్గురిలో కామన్ పాయింటే అని కొంతమంది నెటిజనులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.