హీరో నందు, ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీగౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్బస్టర్'. రాజ్ విరాట్ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు అక్టోబర్ 21వ తేదీన అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఎనౌన్స్ చేసారు.
రఘు కుంచె, కిరీటి దామరాజు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. విజయీభవ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మింపబడుతుంది.