శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "మది". ఈ సినిమాకు స్టోరీ - స్క్రీన్ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్ నాగ ధనుష్, కాగా PVR రాజా సంగీతం అందించారు.
గత శనివారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్రేమించుకున్న ఒక జంట, పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోని పెద్దవాళ్ళు, హీరోయిన్ కి వేరొకరితో పెళ్ళైపోవడం, హీరోను మర్చిపోలేక దొంగచాటుగా అతన్ని కలుసుకుని, అతని బాగోగులు చూసుకోవడం... ఇలాంటి నేపథ్యంతో తెరకెక్కిన మది మూవీ క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ ఉండేలా కనబడుతుంది. ట్రైలర్ ఐతే, ఎంగేజింగ్ గా ఉంది. దీంతో ఈ ట్రైలర్ కు యూట్యూబులో పెద్దఎత్తున వీక్షణలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
రామ్ కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాను RV రెడ్డి సమర్పిస్తున్నారు.