సంజయ్ రావు, ప్రణవి మనుకొండ జంటగా నటిస్తున్న చిత్రం "స్లండాగ్ హస్బెండ్". AR శ్రీధర్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు భీమ్స్ ససిరేలియో సంగీతం అందించారు.
ఇటీవలే ఈ సినిమా నుండి లచ్చిగాని పెళ్లి అనే మాస్ ట్రాక్ విడుదలైంది. తదుపరి నిన్ననే ఫ్రస్ట్రేషన్ అనే మరొక ఊరమాస్ ట్రాక్ విడుదలైంది. రాహుల్ సిప్లిగంజ్, భీమ్స్ కలిసి ఆలపించిన ఈ పాటకు యూట్యూబులో 20గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పెళ్ళైన తరవాత ఒక మగాడి ఫ్రస్ట్రేషన్ ఎంతటి పీక్ స్టేజ్ లో ఉంటుందో ఈ పాటలో చూపించారు మేకర్స్.
MIC మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa