పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన వడ్డె సునీతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 30,028 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మీ సేవ ఆంజనేయులు, మునిస్వామి కూడా పాల్గొన్నారు. ఈ సంఘటన కర్నూలు, మంత్రాలయం ప్రాంతంలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa