ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న కామెంట్స్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 23, 2018, 04:08 PM

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న‌ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ పరమ చెత్తగా ఉందని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. ట్రైలర్ లో అరుపులు, కేకలు తప్ప మరేమీ లేదన్నారు. అనవసరంగా టీడీపీ నేతలు ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు సైలెంట్ గా ఉంటే మంచిదని సూచించారు. వర్మ సినిమా రెండు రోజులకు మించి ఆడదని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందని తెలిపారు.


 ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. కాకపోతే, యంగ్ ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ బదులు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వైసీపీ అభిమానులు మద్దతు పలకడం కూడా వేస్ట్ అని కత్తి మహేష్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' సినిమాను ప్రమోట్ చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని... వారి సినిమాలు పార్టీలకు అతీతంగా ఆదరణను చూరగొంటాయని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa