నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై జంటగా, శ్రీనివాసరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం "తగ్గేదేలే". భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, అఖిలేష్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మాటే మంత్రము అనే వీడియో సాంగ్ ను విడుదల చేసారు. హీరోహీరోయిన్ల వివాహ నేపథ్యంలో వచ్చే ఈ పాటకు సీతాకోకచిలుక లోని ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ మాటే మంత్రము ఆడియో ను జత చేసారు. మొత్తంగా, చూడటానికి ఈ పాట చాలా బాగుంది.
పోతే, నవంబర్ 4వ తేదీన ఈ చిత్రం విడుదల కావడానికి రెడీ అవుతుంది.