రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కాంతార". వాస్తవానికి ఇది ఒక కన్నడ సినిమా. కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ రివ్యూలు అందుకోగానే ఆలస్యం చెయ్యకుండా మిగిలిన భాషల్లో కూడా విడుదలై, అక్కడ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కలెక్షన్లను సాధిస్తుంది.
తాజాగా ఈ చిత్రం USA లో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. USA లో ఈ రికార్డు అందుకున్న రెండో కన్నడ చిత్రమిది. ఇక, ఎలాగూ వీకెండ్ వచ్చేసింది... అందులోనూ దీపావళి పండగ కూడా ఉంది కాబట్టి కాంతార కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
కన్నడలో ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించగా, తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ కొనుగోలు చేసింది.