మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొత్త చిత్రం "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, షఫీ కీలకపాత్రలు పోషించారు. క్యామియో రోల్స్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నటించారు.
దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ నజభజ అనే పవర్ఫుల్ యాక్షన్ సాంగ్ ను విడుదల చేసారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.