టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ నటించిన "మేజర్" 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కు సెలక్ట్ అయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఐతే మొత్తంగా మన టాలీవుడ్ నుండి ఈ ఫెస్టివల్ కు నాలుగు సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. విశేషమేంటంటే, అందులో మేజర్ లేదు. అవును ... మేజర్ సెలెక్ట్ అయ్యింది హిందీ క్యాటగిరి నుండి.
RRR, అఖండ, సినిమా బండి, ఖుదీరాం బోస్... చిత్రాలు 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీన్ కాబోయే తెలుగు చిత్రాలు. హిందీ పరిశ్రమ నుండి ది కాశ్మీర్ ఫైల్స్, మేజర్ చిత్రాలు సెలెక్ట్ అవ్వగా, కోలీవుడ్ నుండి జైభీమ్ సెలెక్ట్ అయ్యింది.
ఈ ఫెస్టివల్ నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగుతుంది.