ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ సిద్దార్థ్ "కార్తికేయ 3" స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 08:21 PM

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నుండి ఇటీవల విడుదలైన చిత్రం "కార్తికేయ2". మిస్టరీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.


కార్తికేయ 2 ఎండింగ్ లోనే సీక్వెల్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ని మనకు చూపిస్తారు. దీంతో కార్తికేయ 3 పై అందరి దృష్టి పడింది. కానీ కార్తికేయ 3 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించటల్లేదు. ఎందుకంటే, హీరో నిఖిల్ ఆల్రెడీ కమిట్ ఐన ప్రాజెక్టులను పూర్తి చెయ్యాల్సి ఉంది. అలానే డైరెక్టర్ చందు మొండేటి కూడా తన కమిట్మెంట్స్ ను పూర్తి చెయ్యాల్సి ఉంది.


ఈ నేపథ్యంలో కార్తికేయ 2024లోనే లాంచ్ అవుతుందని, 2025లో సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ సీక్వెల్ వీలైనంత త్వరగా పట్టాలెక్కాలని కోరుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com