నిన్న విడుదలైన "ఓరి దేవుడా" చిత్రం తొలిషోతోనే హిట్ టాక్ సాధించి, ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. కోలీవుడ్ సూపర్ హిట్ ఓహ్ మై కడవులే కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 'లవ్ గాడ్' గా కీలక అతిధి పాత్రలో నటించారు.
ఈ సినిమాపై వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో కీలక అతిధి పాత్రలో నటించినందుకు గానూ వెంకటేష్ గారు మూడు కోట్లను పారితోషికంగా అందుకున్నారట. విశేషమేంటంటే, ఈ మూవీ షూటింగ్ ను వెంకటేష్ కేవలం ఐదే ఐదు రోజుల్లో పూర్తి చేసారంట. ఐదు రోజుల షూట్ కోసం మూడు కోట్ల పారితోషికం... ఈ వార్త వింటే ఎవరైనా 'ఓరి దేవుడా' అనాల్సిందే.