ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా సినీ ప్రేమికుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.03 కోట్లు వసూలు చేసింది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ మనీష్ చౌదరి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ సంగీతం అందించారు.
'ది ఘోస్ట్' కలెక్షన్స్ :::
నైజాం : 1.81 కోట్లు
సీడెడ్ : 65 L
UA : 90 L
ఈస్ట్ : 38 L
వెస్ట్ : 21 L
గుంటూరు : 42 L
కృష్ణా : 43 L
నెల్లూరు : 23 L
టోటల్ కలెక్షన్స్ : 5.03 కోట్లు (8.92 కోట్ల గ్రాస్)