సరైనోడు, ఇద్దరమ్మాయిలు తదితర సినిమాల్లో నటించిన కేథరిన్ ట్రెసా క్రిస్మస్ వేడుకలకు సిద్దమవుతోంది. ఈ సందర్బంగా పలు ముచ్చట్లు తెలియజేసింది. క్రిస్మస్ అంటే జీసస్ పుట్టినరోజు. జీసస్ అన్నీ మంచి మాటలు చెప్పారు. ఏ షరతులూ లేకుండా ఇతరుల్ని ప్రేమించమన్నారు. క్రిస్మస్ ఇచ్చే స్ఫూర్తి ఏంటంటే... ఎదుటి వ్యక్తులు ఏవైనా తప్పులు చేస్తే వాళ్ళను క్షమించమని చెప్పడం! మనమంతా మనుషులం కదా... తప్పులు చేస్తాం. అది మన నేచర్. అయితే... తప్పు చేసిన వాళ్ళను క్షమించే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి కేథరిన్ తెలిపింది.
అలాగే మన మనసులో ఎదుటివ్యక్తులపై ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఒకవేళ ద్వేషం ఉంటే దాన్ని తుడిచేయాలి. ఇతరులకు దానం చేయాలి. జీసస్ ని నమ్మేవారూ, ఆయన్ను అనుసరించే వారందరూ ఈ దారిలో నడుచుకోవాలి. ప్రార్థనలు చేయాలి. మంచితనంతో మెలగాలి. ఇకపోతే ఎక్కువగా అమ్మే క్రిస్మస్ కేక్ రెడీ చేసేది. నేను చేయడం తక్కువే! ఎందుకంటే... మా అమ్మ నన్ను కిచెన్‌లోకి ఎంటర్ కానిచ్చేది కాదు. ‘నువ్వు కిచెన్‌లోకి వస్తే నా పని డబుల్ అవుతుంది. దయచేసి ఇటు రావొద్దు. నువ్వు కిచెన్ బయటే ఉండు’ అని చెప్పేది. (నవ్వుతూ...) నేను చాలా చెత్తగా చేస్తాననీ, నా సహాయం అవసరం లేదనీ అనేదని కేథరిన్ వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa