కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న చిత్రం "వారిసు". ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరెక్కుతున్న ద్విభాషా చిత్రం అని అన్నారు కానీ, ఈ సినిమా పక్కా తమిళ సినిమా అని, వారసుడు టైటిల్ తో తెలుగులోకి డబ్ చేయబడుతుందని తాజాగా వంశీ పైడిపల్లి క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా నుండి దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ, అలాంటిదేమి లేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దిల్ రాజును విమర్శించారు. దీంతో దిల్ రాజు సొంత ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుండి వారసుడు లేటెస్ట్ స్టిల్స్ కొన్ని బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.