విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ‘థ్యాంక్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఈ సినిమా జెమినీ టీవీలో ప్రసారం కానుంది. రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు.